మరో చిరుత దొరికేసింది.. ఆ ప్రాంతంలోనే
తిరుమలలో భక్తులను చిరుతలు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే.. దీంతో వాటిని బంధించడానికి
తిరుమలలో భక్తులను చిరుతలు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే..! దీంతో వాటిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి కాలి నడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్టు అధికారులు తాజాగా తెలిపారు. చిరుతలు బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పలుమార్లు బోను వరకూ వచ్చి వెళ్లినట్టు కూడా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఆదివారం రాత్రి ఈ చిరుత బోనులో చిక్కింది. ఇప్పటివరకూ మొత్తం నాలుగు చిరుతలు పట్టుకున్నారు అధికారులు.
జూన్ నెలలో ఓ చిరుతను బంధించగా, ఆగస్టు 14న ఓ చిరుత దొరికింది. ఆగస్టు 17న మరో చిరుత బోనులో పడింది. తాజాగా ఇంకో చిరుత బోనులో దొరికింది. నాలుగు చిరుతలు ప్రస్తుతానికి పెట్టేసుకున్నారు. ఇంకా ఎన్ని ఉన్నాయో అధికారుల నుండి ప్రకటన రానుంది. ఆగస్టు 12న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను తిరుమల నడక మార్గంలో చిరుత లాక్కెళ్లి దారుణంగా చంపేసింది. ఈ ఘటనతో టీటీడీ, అటవీశాఖ అధికారులు కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. ప్రత్యేకంగా బోనుల్ని తెప్పించి చిరుతల్ని బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.