అల్లూరి జిల్లాలో అంత్రాక్స్.. వణుకుతున్న గిరిజనులు
ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతుంది. ఏడురుగు విద్యార్థులు అంత్రాక్స్ వ్యాధి సోకింది
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టు మండలం దొరగుడ గ్రామంలో ఏడురుగు విద్యార్థులు అంత్రాక్స్ వ్యాధి బారిన పడ్డారు. పదేళ్ల క్రితం గిరిజన గ్రామాల్లో ఈ వ్యాధి వ్యాపించింది. కొందరు మృత్యువాత పడ్డారు. తిరిగి గిరిజన గ్రామాల్లో అంత్రాక్స్ వ్యాధి ప్రబలడం ఆందోళన కల్గిస్తుంది. ఈ వ్యాధి పశువుల నుంచి సంక్రమిస్తుంది.
ఏడుగురు విద్యార్థులకు...
లక్ష్మీపురంలో జరిగిన సంతలో నిర్వహించిన లబ్బూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిర్వహించిన శిబిరంలో అంత్రాక్స్ వ్యాధిని గుర్తించారు. మొత్తం ఏడుగురు విద్యార్థులకు అంత్రాక్స్ వ్యాధి సోకినట్లు గుర్తించారు. దీంతో గ్రామంలో వైద్యాధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంత్రాక్స్ వ్యాధి సోకిన ఏడుగురు విద్యార్థుల రక్త నమూనాలను విశాఖలోని కేజీహెచ్ కు పంపారు.