ఏపీలో కొనసాగుతోన్న లీకుల పర్వం.. నిన్న తెలుగు, నేడు హిందీ పేపర్లు లీక్ ?

తొలిరోజు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే.. క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపులో లీకైందంటూ వార్తలొచ్చాయి.

Update: 2022-04-28 08:37 GMT

శ్రీకాకుళం : ఏపీలో ఏప్రిల్ 27 బుధవారం నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు పరీక్ష మొదలైన కొద్దిసేపటికే.. క్వశ్చన్ పేపర్ వాట్సాప్ గ్రూపులో లీకైందంటూ వార్తలొచ్చాయి. తొలిరోజు చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైందని వార్తలు రాగా.. అందులో నిజం లేదని అధికారులు తెలిపారు. తొలుత పేపర్ లీక్ కాలేదని, వందంతులు నమ్మొద్దని డీఈవో, కలెక్టర్ ప్రకటించారు. తాజాగా చిత్తూరు జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ పై విచారణ జరపగా.. తెలుగు పరీక్షా పేపర్ ను గరిధర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు వాట్సప్ గ్రూప్ లో షేర్ చేసినట్లు గుర్తించారు. దీంతో గరిధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నారాయణ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడికి ప్రశ్నాపత్రం ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక రెండవ రోజు కూడా ఇదే జరిగింది. రెండవ రోజు హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రం చక్కర్లు కొట్టింది. శ్రీకాకుళం జిల్లా సరబుజ్జిలి మండలం రొట్టవలస పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ అయినట్లు వార్తలొచ్చాయి. పరీక్ష ప్రారమైన కాసేపటి తర్వాత ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపిచినట్లు తెలియడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. వరుసగా ప్రశ్నాపత్రాలు లీకవుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే జరిగితే.. మెరిట్ విద్యార్థుల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నాపత్రాల లీకులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతమవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.







Tags:    

Similar News