మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు, ఏఎంఆర్డిఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మార్చి 11న..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారయింది. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మార్చి 8న దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సభ సంతాపం తెలుపనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులు, ఏఎంఆర్డిఏ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మార్చి 11న రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి.. అన్ని శాఖల కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. అలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమపై సీఎం జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల అంశం కూడా చర్చకు రానుంది.