ఏపీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్.
ఆంధ్రప్రదేశ్ లో తొలి బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి పార్టీ) కార్యాలయం ప్రారంభమైంది. గుంటూరులోని ఐదు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ ఏపీలో కార్యకలాపాలను విస్తృతం చేసింది. గుంటూరు ఏర్పాటు చేసిన కార్యాలయంలో మొదటి అంతస్తులో సమావేశ మందిరం, రెండు, మూడు అంతస్తుల్లో పరిపాలనా విభాగాలకు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఏపీలో బీఆర్ఎస్ కు విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోదని, ప్రస్తుతం మహారాష్ట్రలో పార్టీ దూకుడుగా ఉందని తెలిపారు. మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలతో పాటు మద్యప్రదేశ్ లోనూ పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు.