అప్పుడే పేదరికం పోతుంది

విద్యార్థులను అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు

Update: 2021-11-30 06:20 GMT

విద్యార్థులను అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. చదువు వారి జీవితాలనే కాకుండా దేశాన్ని కూడా మారుస్తుందన్నారు. అందుకే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి వంటి కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద 11 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లోకి జగన్ ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద 638 కోట్ల నగదును జమ చేశారు.

కరోనా సమయంలోనూ...
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కరోనా సమయంలోనూ పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని పథకాలను ఆపలేదన్నారు. ఉన్నత చదువుల వల్లనే పేదల తలరాత మారుతుంది. విద్యార్థులు ఫీజుల కోసం టెన్షన్ పడకుండా తమ చదువును కొనసాగించుకోవచ్చని జగన్ సూచించారు. విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జగన్ చెప్పారు.


Tags:    

Similar News