ఆ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించిన జగన్

చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు;

Update: 2022-03-27 04:18 GMT
new districts, ys jagan, april 4th, andhra pradesh
  • whatsapp icon

చిత్తూరు జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల చొప్పును పరిహారం అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు. క్షతగాత్రులు కోలుకునేంత వరకూ వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని జగన్ చిత్తూరు జిల్లా అధికారులను ఆదేశించారు.

చిత్తూరు జిల్లాలో...
చిత్తూరు జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా పడి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. వీరంతా అనంతపురం జిల్లాకు చెందిన వారు. నిశ్చితార్థం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చి వీరు ప్రమాదం బారిన పడ్డారు. బస్సు డ్రైవర్, క్లీనర్ తో సహా ఈ ప్రమాదంలో మరణించారు.


Tags:    

Similar News