ప్రజలు మా వెంటే ఉన్నారు
తమ ప్రభుత్వానికి ప్రజలు 97 మార్కులు వేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు;
తమ ప్రభుత్వానికి ప్రజలు 97 మార్కులు వేశారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజల చల్లని దీవెనలు తమ వెంటే ఉన్నాయని జగన్ అన్నారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ట్వీట్ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ప్రజలు తమకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒక్కటి మినహా....
ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దర్శి మినహా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. తమ ప్రభుత్వం ప్రజల వెంటే ఉంటుందని జగన్ చెప్పారు.