ఉద్యోగులకు జగన్ సంక్రాంతి కానుక

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది.

Update: 2022-01-05 06:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనుంది. రేపు పీఆర్సీపై స్పష్టత వచ్చే అవకాశముంది. రేపు ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు సమాచారం అందినట్లు తెలిసింది. సంక్రాంతి పండగకు ముందే పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తుంది.

నేడు ఆర్థిక శాఖ అధికారులతో....
పీఆర్సీపై గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతుంది. ఫిట్ మెంట్ ఎంతన్న దానిపైనే చర్చలు జరుపుతున్నారు. కానీ అవేమీ కొలిక్కి రాలేదు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్నారు. పీఆర్సీపై వీరితో చర్చించనున్నారు. రేపు ఉద్యోగ సంఘాల భేటీలో పీఆర్సీపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News