నేడు సీఎం ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.;

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ లో ఆయన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఏరియల్ సర్వే కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తుననారు. మరో రెండు రోజుల పాటు గోదావరి ప్రవాహం పెరుగుతుందన్న హెచ్చరికలతో జగన్ అధికారులను అప్రమత్తం చేశారు.
లంకగ్రామాలన్నీ....
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అనేక లంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. పంటలన్నీ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసి వరద పరిస్థితి తెలుసుకోనున్నారు.