మార్గదర్శిని అప్పుడే మూసేస్తాం : సీఐడీ చీఫ్
మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు
మార్గదర్శి యాజమాన్యం అక్రమాలు ఎస్టాబ్లిష్ అయితే కంపెనీని మూసివేస్తామని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన అయిన రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నుంచి సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయని, విశాఖ, విజయవాడ, రాజమండ్రి గుంటూరులో ఫోర్మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేశామననారు. 1982 చిట్ ఫండ్ యాక్ట్ 76, 79 సెక్షన్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని సంజయ్ తెలిపారు. అన్ని బ్రాంచుల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుందని చెప్పారు. చిట్టీదారుడకుకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదని, జవాబుదారీతనం లేదని తెలడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన అన్నారు. కస్టమర్ల సొమ్మును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్సుకు వ్యతిరేకమని సంజయ్ తెలిపారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు బ్రాంచ్ ల ఫోర్‌మెన్ లను కోర్టులో ప్రవేశపెట్టామని, చిట్స్‌లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదని అన్నారు.