Chandrababu : సుప్రీంకోర్టుకు సీఐడీ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ సీఐడీ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది

Update: 2023-11-21 03:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ సీఐడీ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. నిన్న హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఐడీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయని సుప్రీంకోర్టులో సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించనున్నారు.

స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో...
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గతంలో యాభై రెండు రోజుల పాటు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో దీనిపై సీబీఐ నేడు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసే అవకాశముంది. ఈ నెల 30వ తేదీ వరకూ చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లో విధించిన షరతులు అమలులో ఉన్నందున ఈ లోపు సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఐడీ నిర్ణయించింది.


Tags:    

Similar News