Madanapalle: మదనపల్లె ఘటన.. ప్రకంపనలు సృష్టించబోతోందా?

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు దహనమైన ఘటన ఏపీ రాజకీయాల్లో

Update: 2024-07-23 02:41 GMT

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు దహనమైన ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతోందా? ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి పెట్టిన తీరు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఘటనలో నిజా నిజాలు తేల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుట్రపూరితంగా జరిగినట్లుగా కనిపిస్తోందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడం, దస్త్రాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పడం లాంటివి చూస్తుంటే.. షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా కనిపిస్తోందన్నారు. అది కూడా కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని.. అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికి అప్పుడు తన ముందు ఉంచాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అసైన్డ్ భూములు, 22ఏ జాబితాలోని భూములు, వివాదాస్పద భూములు, హైవే ప్రాజెక్టుల భూసేకరణ సంబంధిత డాక్యుమెంట్లు దహనమైనట్లుగా ప్రాథమిక సమాచారం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారుల పనితీరులో మార్పు రావాలన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొందరు అధికారులు, ఉద్యోగులు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనం అన్నారు. ఆధారాల సేకరణలోనూ జాప్యం జరిగిందన్నారు.


Tags:    

Similar News