ఆ దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం వద్దు: సీఎం జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం వద్దని సూచించారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. అసాంఘిక శక్తులు అనే పదానికి రీ డిఫైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బ తీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే అన్నారు. పోలీసు కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. దేశంలో తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చినట్లు జగన్ వెల్లడించారు.
ప్రజా స్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాల అర్థం అంటే.. ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని, పోలీసులు, న్యాయస్థానం నుంచి లాక్కోవటం కాదన్నారు సీఎం జగన్. అంగళ్లులో ప్రతి పక్ష నేత తమ పార్టీ వారిని రెచ్చ గొట్టి పోలీసులపై దాడి చేయించారని.. పుంగనూరులో 40 మంది పోలీసులు గాయాలు అయ్యేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్నారు. అవినీతి చేసి, నేరాలు చేసి ఆపై ఆధారాలు అన్నీ చూసిన తర్వాత న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వక పోతే న్యాయ మూర్తుల మీద ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు సీఎం జగన్.