ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఏళ్లలో అన్ని వర్గాల వారికి సంక్షేమ..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నారు. అయితే గడిచిన ఏళ్లలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, కాపు వర్గాలు అన్ని వర్గాలకు పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. నా బీసీ, నా ఎస్సే,నా ఎస్టీ, నా మైనారిటీ అంటూ పేదల ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ప్రభుత్వం పై సానుకూలంగా ఉన్నారని సీఎం జగన్ చెబుతున్నారు. మేనిఫెస్టో లో 99 శాతం హామీలు నెరవేర్చామని కూడా సీఎం జగన్ చెబుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు మిగిలిన ఒకటి, రెండు కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే జనవరి నుంచి సామాజిక పెన్షనలను 3 వేల రూపాయలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎ జగన్. ఇక మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. సివిల్స్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమల్లోకి తీసుకువచ్చారు.