ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. బద్వేలును రెవిన్యూ డివిజన్ చేస్తూ జీఓ విడుదల చేశారు. ఈ ఏడాది జులైలోనే బద్వేలులో పర్యటించిన సీఎం.. బద్వేలును రెవెన్యూ డివిజన్ గా చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు జగన్. బద్వేల్ ను రెవిన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ జీఓ జారీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బద్వేల్ నియోజకవర్గ ప్రజలు బద్వేల్ ను రెవిన్యూ డివిజన్ చేసిన సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా.. పశ్చిమగోదావరిజిల్లా తణుకులో సీఎం జగన్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 50 లక్షలకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతోందని జగన్ వెల్లడించారు. అనంతరం పార్టీ నేతల సమక్షంలో కేక్ కట్ చేసి, పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.