ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. తిరిగి ఏపీకి పయనమయ్యేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి

Update: 2022-01-04 10:39 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. తిరిగి ఏపీకి పయనమయ్యేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు జగన్. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లతో భేటీ అయ్యారు. మంగళవారం వరుసగా.. కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార ప్రసార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లతో భేటీ అయ్యారు.వరుసగా ప్రధాని, మంత్రులతో సమావేశమైన జగన్.. వారితో ఏయే విషయాలపై చర్చించారన్న వివరాలు తెలియాల్సి ఉంది.



Tags:    

Similar News