"ఏపీ సేవా" పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్

సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని, దీనికి 'ఏపీ సేవ' అనే పేరును పెట్టామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం

Update: 2022-01-27 11:12 GMT

ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సచివాలయాల ద్వారా పరిపాలనను మరింత చేరువ చేసిన ప్రభుత్వం.. దానిని ఇంకా సులభతరం చేసేలా ఏపీ సేవా పేరుతో ఓ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ను తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు అందించే అన్ని సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకే ఏపీ సేవా పోర్టల్ ను తీసుకొచ్చామని తెలిపారు.

సిటిజెన్ సర్వీసెస్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని, దీనికి 'ఏపీ సేవ' అనే పేరును పెట్టామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో సైతం ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. ఇకపై డాక్యుమెంట్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. దేనికైనా దరఖాస్తు చేసుకుంటే.. అది ఏ దశలో ఉందో ఈ పోర్టల్ ద్వారా తెలుసోకవచ్చన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఏ అధికారి వద్ద తమ ఫైల్ ఉంది అనేది లబ్ధిదారునికి తెలుస్తుందని... ఉద్యోగుల జవాబుదారీతనం మరింత పెరుగుతుందని సీఎం జగన్ తెలిపారు.



Tags:    

Similar News