ట్రాక్టర్ ను నడిపిన జగన్
తంలో చంద్రబాబు ప్రభుత్వంలో ట్రాక్టర్ డీలర్లతో కుమ్మక్కయి కమీషన్ల కోసం కక్తుర్తి పడ్డారని ఏపీీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ట్రాక్టర్ డీలర్లతో కుమ్మక్కయి కమీషన్ల కోసం కక్తుర్తి పడ్డారని ఏపీీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అప్పుడు ట్రాక్టర్ల పంపిణీలో కూడా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అవినీతి లేకుండా రైతులు ఇష్టపడే పరికరాలే నేడు పంపిణీ చేస్తున్నామని, వారికి ఇష్టం వచ్చిన ట్రాక్టర్లు కొనుగోలు చేసుకునేందుకు రైతులకు స్వేచ్ఛ ఇచ్చామని జగన్ తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని జగన్ ప్రారంభించారు. స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహపర్చారు.
రైతులకు సబ్సిడీ కింద...
10750 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అక్కడే రైతులకు పరికరాలు, పురుగుమందులు, ఎరువులు పంపిణీ చేస్తుంది. రైతులను గ్రూపులుగా ఏర్పడితే వారికి వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్ తో సహా అన్ని పరికరాలన్నీ వారికి సబ్సిడీతో అంద చేయడం జరగుతుందన్నారు. 2,016 కోట్ల రూపాయలతో ట్రాక్టర్లు వారికి అందచేయడం జరుగుతుందన్నారు. 3,820 ట్రాక్టర్లు ఈరోజు రైతులకు అందచేస్తామన్నారు. 175 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. 1120 పరికరాలను కూడా ఈరోజు రైతులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుందన్నారు. 5,260 గ్రూపు ల రైతుల ఖాతాల్లోకి 590 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఈరోజే విడుదల చేస్తుందని జగన్ తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు కూడా వైసీపీ యంత్ర సేవా పథకం ఉపయోగపడుతుందన్నారు.