ఆ ప్రాంతం వారికి ఫ్లడ్ వార్నింగ్
కృష్ణానదికి వరద పెరుగుతున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాగులు, వంకలు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయవద్దని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ అయిందని ఆయన తెలిపారు
అప్రమత్తంగా ఉండాలని...
ప్రస్తుతం పులిచింతల వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందన్నారు. అవుట్ ఫ్లో 3.96 లక్షల క్యూసెక్కులు ఉందని చెప్పారు. కృష్ణా బ్యారేజీ వ్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5.09 లక్షల క్యూసెక్కులు ఉందని చెప్పారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల వరద ఉధృతి పెరిగిందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.