Andhra Pradesh: ఈరోజు పిడుగులు ఇక్కడ పడే అవకాశం... బీ అలెర్ట్

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.

Update: 2024-06-26 01:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులు కూడా పడతాయని తెలిపింది. బుధవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముుందని పేర్కొంది. ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈ ప్రాంతంలో కూడా...
వీటితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, నంద్యాల, కడప, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో పిడుగులు కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడి ఉండకూడదని అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News