ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్స్ షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత..;
అమరావతి : ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈఏపీ సెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈ సెట్, ఈ సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది.
జులై4వ తేదీ నుంచి 12 వరకూ ఈఏపీసెట్, జులై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్, జులై 18 నుంచి 21 వరకూ పీజీ ఈ సెట్, జులై 22న ఈసెట్, జులై 25న ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి.