అప్పుడు లేని గగ్గోలు ఇప్పుడెందుకు..

టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అని

Update: 2023-05-23 15:46 GMT

టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అని జీవో తెచ్చినప్పుడు నోరెత్తనివారు, ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి ఇప్పటివరకు ఆరుసార్లు విచారణకు వెళ్లారని అన్నారు. ఈ కేసులో అవినాష్ సీబీఐ అధికారులకు ముందు నుంచి సహకరిస్తున్నారని తెలిపారు. ఒక వేళ సీబీఐ అధికారులు అవినాష్‌ను తీసుకెళ్లినా పోయేదేముంది అని కామెంట్స్ చేశారు. తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో విచారణకు హాజరుకాలేనంటూ వారం రోజులు సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశాడని సజ్జల తెలిపారు.

మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్న రోజే డైవర్షన్ కోసం కేంద్ర బలగాలు అంటూ.. కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ గురించి కొన్ని మీడియా సంస్థలు టీడీపీ కంటే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. కర్నూలు ఎస్పీ సహకరించడం లేదని ఎవరు చెప్పారు? సీబీఐ వాళ్లు చెప్పారా?' అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు అభిమానంతో వస్తారు. ఏంటి ఈ అన్యాయమని అడగడానికి కార్యకర్తలు వస్తారు. తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇంత దుర్మార్గమా.. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా? రియల్ మీడియాపై దాడి ఎక్కడైనా జరిగిందా.. కరడుగట్టిన వారిపై జరిగి ఉండొచ్చు. తప్పుడు వార్తలు వేస్తుంటే కొందరు అభిమానులు ఆవేశంలో రియాక్ట్ అయ్యి ఉంటారు. మీడియా ముసుగులో కొందరు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారు' అని ఫైర్ అయ్యారు.

సీబీఐ అధికారులు, రాష్ట్ర పోలీసులకు ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు. డిపార్టమెంట్ టు డిపార్ట్‌మెంట్ చాలా జరుగుతాయి. అవినాష్‌రెడ్డి ఏమైనా పరారవుతున్నాడా. శిక్ష పడి తప్పించుకుని తిరుగుతున్నాడా? వారం రోజులు సమయం అడిగాడు. వాళ్లు సమయం ఇస్తారో.. వచ్చి తీసుకుని వెళ్తారో.. తీసుకుని వెళ్లినా పోయేదేముందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సజ్జల. 

Tags:    

Similar News