సచివాలయ ఉద్యోగులకు సెలవులు రద్దు
ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉదయం 10.45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని,
అమరావతి : ఏపీ సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సోమవారం సెలవు ఇవ్వొద్దంటూ ఆదేశాలు వచ్చాయి. డీఎల్ పీఓ, ఎంపీడీఓ, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులకు సెలవులు మంజూరు చేయవద్దని కలెక్టర్లు, ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి స్కానింగ్ ప్రతులను ఉదయం 10.45 గంటల్లోగా ఉన్నతాధికారులకు పంపించాలని, హెడ్ క్వార్టర్లను వదిలి వెళ్లరాదని ఆదేశించారు. కాగా.. ప్రతి సోమవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గ్రీవెన్స్ నిర్వహిస్తారు. బాధితులు తమ తమ సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం సచివాలయానికి వస్తున్న నేపథ్యంలో ఇకపై ఉద్యోగులకు సెలవులు మంజూరు చేయకూడదని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.