ఏపీలో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఎస్సై పోస్టులకు డిసెంబర్ 14 నుండి జనవరి 18 వరకు, కానిస్టేబుల్ పోస్టులకు నవంబర్ 30 నుండి డిసెంబర్ 28 వరకు..;
ఏపీ పోలీస్ శాఖలో 6,511 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 411 ఎస్సై, 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 315 సివిల్ ఎస్సైలు, 96 ఆర్ఎస్సై పోస్టులున్నాయి. కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2560 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నారు.
ఎస్సై పోస్టులకు డిసెంబర్ 14 నుండి జనవరి 18 వరకు, కానిస్టేబుల్ పోస్టులకు నవంబర్ 30 నుండి డిసెంబర్ 28 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది జనవరి 22న, ఎస్సై పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 19న ప్రిలిమనరీ రాత పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు slprb.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. దరఖాస్తులు కూడా ఈ వెబ్ సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది.