కోర్టు ధిక్కరణ కేసు : ఇద్దరు ఉన్నతాధికారులకు జరిమానా, 6 నెలలు జైలు

కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు..

Update: 2022-04-21 13:42 GMT

అమరావతి : కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జరిమానా, 6 నెలలు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబుల‌వారిప‌ల్లె మండ‌లం మంగంపేటలో 2003లో జ‌రిగిన మైనింగ్ కార‌ణంగా గ్రామానికి చెందిన న‌ర‌స‌మ్మ అనే మహిళ త‌న ఇంటిని కోల్పోయారు. ప‌రిహారం కోసం ప్ర‌భుత్వాన్ని ఆశ్ర‌యించ‌గా.. ఆమెకు ఫ‌లితం ద‌క్క‌లేదు.

దాంతో తనకు న్యాయం చేయాలంటూ నరసమ్మ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ ను విచారించిన కోర్టు.. ఆమెకు ప‌రిహారం చెల్లించాల‌ని ఇదివ‌ర‌కే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ఆమెకు ప‌రిహారం అంద‌లేదు. దీంతో మ‌రోమారు న‌ర‌స‌మ్మ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. రాజంపేట స‌బ్ క‌లెక్ట‌ర్ ఖేత‌న్ గ‌ర్గ్‌, ఏపీఎండీసీ సీపీఓ సుద‌ర్శ‌న్ రెడ్డిల‌కు 6 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు రూ.2 వేల చొప్పున జ‌రిమానా విధించింది.



Tags:    

Similar News