ఇక్కడ ఏదీ కలిసిరావడం లేదే?
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హై కోర్టు కొట్టివేసింది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ తీర్పు వచ్చింది. చంద్రబాబు, ఆయన అనుచరులు ఆశించిన తీర్పులు రాకపోవడంతో టీడీపీ కేడర్ దిగాలు పడుతూ ఉంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చారు. వారిపై ఐపీసీ 120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ మంగళవారం విచారణకు హాజరుకానున్నారు.