AP Inter Exams : ఆ క్వశ్చన్ పేపర్ లో తప్పులు.. 2 మార్కులు కలపనున్న బోర్డు

నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఈ విషయం తెలియజేయకపోవడంతో..

Update: 2023-03-28 07:54 GMT

ap intermediate exams 2023

ఏపీలో ప్రస్తుతం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో భాగంగా మార్చి 27 సోమవారం ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎగ్జామ్ నిర్వహించారు. అయితే.. తెలుగు మీడియంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో మూడో ప్రశ్నకు ‘ఆయస్కాంత ప్రవణత (అవపాతము)ను నిర్వచించుము?’ అని ఇచ్చారు. ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ ఇన్‌క్లినేషన్‌ ఆర్‌ యాంగిల్‌ ఆఫ్‌ డిప్‌?’ అని రావడానికి బదులుగా ‘డిఫైన్‌ మ్యాగ్నటిక్‌ డెక్లినేషన్‌?’ అని తప్పుగా వచ్చింది.

దాంతో ఇంటర్ బోర్డు అన్ని పరీక్ష కేంద్రాలకు సందేశాలు పంపింది. కానీ అక్కడున్న వారు అందరూ విద్యార్థులకూ ఈ విషయాన్ని చెప్పలేదు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఈ విషయం తెలియజేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని, ప్రశ్న తప్పుగా వచ్చిందని తమకెవరూ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన గమనించిన రాష్ట్ర ఇంటర్ బోర్డు.. తప్పుగా వచ్చిన ఆ ప్రశ్నకు 2 మార్కులు కలపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రశ్నకు విద్యార్థులు సమాధానం రాసినా.. రాయకున్నా విద్యార్థులకు 2 మార్కులు కలవనున్నాయి.


Tags:    

Similar News