ఏపీలో ఇంటర్ కాలేజీలకు సెలవులు !

ఏపీలో ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఇంటర్ విద్యామండలి. సంక్రాంతి పండుగ సందర్భంగా;

Update: 2022-01-06 08:56 GMT
ఏపీలో ఇంటర్ కాలేజీలకు సెలవులు !
  • whatsapp icon

ఏపీలో ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది ఇంటర్ విద్యామండలి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని ఇంటర్ కాలేజీలకు జనవరి 8వ తేదీ నుంచి 16వరకూ సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఏకంగా 9 రోజులపాటు సంక్రాంతి సెలవులు ఇవ్వడం గమనార్హం. వీటిలో రెండు ఆదివారాలే ఉండగా.. వారంరోజులు ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఇచ్చింది.

సంక్రాంతి సెలవుల అనంతరం తిరిగి జనవరి 17వ తేదీన కాలేజీలు పునః ప్రారంభమవ్వనున్నాయి. కాగా.. ఇతర విద్యాసంస్థలకూ సంక్రాంతి సెలవులు ప్రకటించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అటు తెలంగాణలోనూ సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మెడికల్ కాలేజీలు మినహా అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులిచ్చిన విషయం తెలిసిందే.



Tags:    

Similar News