పవన్ కళ్యాణ్ కు ఘాటుగా బదులిచ్చిన గుడివాడ అమర్ నాథ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభు

Update: 2023-07-21 12:24 GMT

వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పిన వాలంటీర్లు గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జ‌లకు పింఛ‌న్ అందిస్తున్నారు.. వారికి అవ‌స‌ర‌మైన ప్ర‌భుత్వ స‌ర్టిఫికెట్లు అందిస్తున్నారు. క‌రోనా సమ‌యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వ‌హించారు. వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు సమాచారం అందించారని అన్నారు అమర్ నాథ్. అప్పుడు నువ్వు, నీ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముసుగుత‌న్ని ప‌డుకున్నారన్నారు. ఆరోజు తెలియ‌లేదా వాలంటీర్ల‌కు బాస్ ఎవ‌రు? ఎవరు చెప్తే వారు ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నారు? వారు ఏ మంత్రిత్వ శాఖ కింద‌కు వస్తారు అని? ఇప్పుడు వారిపై నింద‌లు వేయ‌డానికి త‌యార‌య్యావు. వాలంటీర్లు చేసే మంచి ఏంటో వారి వ‌ల్ల ల‌బ్ధిపొందుతున్న ప్ర‌జ‌ల‌ను నేరుగా అడుగు తెలుస్తుంది. అంతే త‌ప్ప లారీ ఎక్కి ఊగిపోయి మాట్లాడితేనో.. ఇలా ట్వీట్లు పెడితేనో ఎలా తెలుస్తుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ కు సమాధానం ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్ నాథ్.




జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. వాలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? వాలంటీర్ల వ్యవస్థ ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? లేదా అది ఏపీ ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎంనా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరు?” అని నిలదీశారు. ప్రధానమమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రి కార్యాలయాన్ని పవన్ ట్యాగ్ చేశారు.


Tags:    

Similar News