రేవంత్ రెడ్డి చేపల పులుసు కామెంట్లకు మంత్రి రోజా గట్టి కౌంటర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిరోజుల కిందట తెలంగాణ నదీ జలాల గురించి మాట్లాడుతూ

Update: 2024-02-27 02:49 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిరోజుల కిందట తెలంగాణ నదీ జలాల గురించి మాట్లాడుతూ ఏపీ మంత్రి రోజా గురించి ప్రస్తావించారు. రోజా పెట్టిన చేపల పులుసు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న మంత్రి రోజా తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఎప్పుడు ఎవరి కోసం చేపల పులుసు చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే.. జాక్ పాట్‌లో సీఎం అయిన రేవంత్ రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. అందుకే ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని అన్నారు రోజా.

తెలంగాణ, ఏపీ మధ్యలో కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల అప్పగింతపై కొద్దిరోజుల కిందట మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. సీఎం జగన్, కేసీఆర్ కలిసి రోజా చేసిన చేపల పులుసు తిని, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వాటా నుంచి నీళ్లు ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై రోజా తాజాగా స్పందించారు. గతంలోనూ రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలు చేసినప్పుడు రోజా ఘాటుగా స్పందించారు. తమ ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాదని, కోవర్టు రెడ్డని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ నేతలను కలవడంలోనే రేవంత్ కోవర్టని తెలుస్తోందన్నారు. 28 వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు డిన్నర్ ఇవ్వడం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు రోజా.


Tags:    

Similar News