ఏపీ కరోనా బులెటిన్ : స్వల్పంగా పెరిగిన కేసులు

నిన్నటి బులెటిన్ లో రాష్ట్రంలో 71 కేసులు నమోదవ్వగా.. నేటి బులెటిన్ లో అంతకు రెట్టింపు కేసులు నమోదయ్యాయి.

Update: 2022-03-01 11:53 GMT

అమరావతి : ఏపీలో రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి బులెటిన్ లో రాష్ట్రంలో 71 కేసులు నమోదవ్వగా.. నేటి బులెటిన్ లో అంతకు రెట్టింపు కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 శాంపిళ్లను పరీక్షించగా.. 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు.

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,729కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 450 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ ఏపీలో 23,17,953 కేసులు నమోదవ్వగా.. 23,01,210 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2014 యాక్టివ్ కేసులుండగా.. వారంతా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News