ఏపీలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. ఒకరు మృతి !

గడిచిన 24 గంటల్లో 103 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. విశాఖలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య

Update: 2022-01-03 12:31 GMT

గడిచిన 24 గంటల్లో ఏపీలో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 122 మందికి పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కోవిడ్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న విడుదలైన రిపోర్ట్ తో పోలిస్తే.. ఈ రోజు రాష్ట్రంలో కొత్త కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా నమోదైన కేసుల్లో.. అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 కేసులున్నాయి. అలాగే కృష్ణాలో 19, చిత్తూరులో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కడప, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తలేవీ నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Also Read : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ !

ఇక గడిచిన 24 గంటల్లో 103 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. విశాఖలో ఒకరు కరోనాతో మరణించారు. దీంతో కలిపి రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 14,498కి పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,832 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం 1278 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

Also Read : ఆచార్య నుంచి " శానా కష్టం నీతో ".. ఫుల్ సాంగ్ రిలీజ్

Tags:    

Similar News