ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు.. ఎక్కడంటే !

ఇటీవలే కెన్యా నుంచి రాష్ట్రానికి వచ్చిన మహిళ(39)కు ఒమిక్రాన్ నిర్థారణ అయింది. బాధిత మహిళ కెన్యా నుంచి చెన్నైకు, అక్కడి నుంచి

Update: 2021-12-22 08:14 GMT

తెలుగు రాష్ట్రాలపై ఒమిక్రాన్ ప్రభావం మొదలైంది. కాస్త లేటైనా సరే.. ఏమాత్రం తగ్గేదే లేదన్నట్లుగా.. చాపకింద నీరులా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 24 కేసులు నమోదవ్వగా.. ఏపీలో రెండో కేసు నిర్థారణ అయింది. ఇటీవలే కెన్యా నుంచి రాష్ట్రానికి వచ్చిన మహిళ(39)కు ఒమిక్రాన్ నిర్థారణ అయింది. బాధిత మహిళ కెన్యా నుంచి చెన్నైకు, అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతిఒక్కరికీ కోవిడ్, ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే మాదిరి ఆమెకు కూడా ఈనెల 12వ తేదీన వైద్య పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ గా తేలింది.

ఒమిక్రాన్ సోకిందా లేదా అని తెలుసుకునేందుకు ఆమె శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించగా.. ఈ రోజు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఆ తర్వాత మహిళ కుటుంబ సభ్యులందరికీ కోవిడ్, ఒమిక్రాన్ నిర్థారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగిటివ్ వచ్చింది. కాగా.. మహిళతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను సేకరించి, వారందరికీ కోవిడ్, ఒమిక్రాన్ పరీక్షలు చేసేందుకు ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజయనగరంలో నమోదైన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News