గుడ్ న్యూస్ : ఏపీలో ఒకే ఒక్క కరోనా కేసు, మరణాలు సున్నా
మిగతా జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 0 గా ఉంది. ఇదే సమయంలో మరో 32 మంది కరోనా నుంచి కోలుకోగా.. కొత్తగా
అమరావతి : గడిచిన రెండ్రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు కావడంతో.. కరోనా బులెటిన్ విడుదల కాలేదు. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేయగా.. ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొద్దిరోజులుగా గణనీయంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు.. ఇప్పుడు ఒకటికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఒకే ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఒక్కకేసును గుర్తించారు. మిగతా జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 0 గా ఉంది. ఇదే సమయంలో మరో 32 మంది కరోనా నుంచి కోలుకోగా.. కొత్తగా ఎవరూ కరోనాతో మరణించలేదు. ప్రస్తుతం 119 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ ఏపీలో 23,19,578 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 23,04,729 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు. ఒకటికి పడిపోయిన కరోనా కేసులు.. 0కి చేరాలని ఆశిద్దాం.