ఏపీలో టెన్త్ తెలుగు ప్రశ్నాపత్రం లీక్
ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. నేటి నుంచి మే 6వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు
చిత్తూరు : ఏపీలో 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. 9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమవ్వగా.. 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో 10వ తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి. చిత్తూరుకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్ లో తెలుగు కాంపోజిట్ పేపర్ ప్రత్యక్షమైంది. పేపర్ ఎప్పుడు లీక్ అయింది అన్న అంశంపై విద్యాశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నాపత్రం లీకైతే పరీక్షను క్యాన్సిల్ చేస్తారా ? అన్న విషయం తెలియాల్సి ఉంది.
ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. నేటి నుంచి మే 6వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల 45నిమిషాలకు పరీక్షలు ముగుస్తాయి. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు అరగంట ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తొలిరోజు తెలుగు పరీక్ష ముగిసింది. కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసిన విషయం తెలిసిందే.