ఏపీకి అకాల వర్షాల ముప్పు.. రెండ్రోజులు వర్షసూచన
దీని ప్రభావంతో ఏపీ, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా ఏపీలోని..
ఏపీకి మళ్లీ అకాల వర్షాల ముప్పు పొంచి ఉంది. ఉత్తర మధ్య మహారాష్ట్రలోని మధ్య భాగాల నుండి ఉన్న ద్రోణి/గాలి కోత ఇప్పుడు ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, మరాఠవాడ, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.ఎత్తులో కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఏపీ, యానాం దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. వీటి కారణంగా ఏపీలోని ఉత్తరకోస్తాలో ఒకట్రెండు ప్రాంతాల్లో రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే రాయలసీమలోనూ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో ఆకాశం మేఘావృతమై, వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది.