గనుల దోపిడీపై దర్యాప్తు జరగాల్సిందే.. అసలు దొంగలను బయటకు లాగాల్సిందే
గత వైసీపీ ప్రభుత్వం జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు
గత వైసీపీ ప్రభుత్వం జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలో జరిగిన గనుల దోపిడీపై వెంకట్ రెడ్డి లాంటి తీగలే కాదని, పెద్ద డొంకలు కూడా కదలాలని ఆమె కోరారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా..విచారణ జరపాలంటూ వైఎస్ షర్మిల కోరారు. అంటే తన సోదరుడు జగన్ పై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
వేల కోట్ల దోపిడీ...
గత ప్రభుత్వ హయాంలో 2,566 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ ఘనుడు వెంకట్ రెడ్డి అయితే, తెరవెనుక ఉండి, సర్వం తానై అయి, వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకు తిన్నారన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్లు,ఒప్పందాలు, నిబంధనలన్ని బేఖాతరు చేసి అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు. .