ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ !

ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్ లను అందించేందుకు నెడ్ క్యాప్ ముందుకొచ్చింది. నెడ్ క్యాప్ గుర్తించిన సంస్థలు

Update: 2022-05-01 05:14 GMT

అమరావతి : ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మొత్తం ఏడువేల మంది ఉద్యోగులకు వాయిదా పద్ధతిలో ఎలక్ట్రిక్ బైకులను అందించేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ.. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బస్ స్టేషన్లలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ.. సర్క్యులర్ జారీ చేసింది.

ఆర్టీసీ ఉద్యోగులకు నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్ లను అందించేందుకు నెడ్ క్యాప్ ముందుకొచ్చింది. నెడ్ క్యాప్ గుర్తించిన సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను అందించనున్నారు. కాగా.. ఒక్కో ఎలక్ట్రిక్ వాహనం ధర లక్ష రూపాయలకు పైగా ఉండగా.. ప్రతి నెలా ఈఎంఐ కింద రూ.2000, రూ.2500 గా కట్టవచ్చని, ఎలాంటి ముందస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. 24 నెలల నుంచి 60 నెలల వరకూ ఈఎంఐ చెల్లించుకునే అవకాశం ఉంది. ఎంపిక చేసుకునే వాహనాన్ని బట్టి దాని వేగం ఆధారపడి ఉంటుందని, వాహన కనీస వేగం 40 కిలోమీటర్ల నుంచి గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగం ఉంటుందని తెలిపింది.




Tags:    

Similar News