మాస్క్ లేకుండా బస్సెక్కారో.. భారీ ఫైనే

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఏపీలో నిన్న 1200కి పైగా కొత్తకేసులు బయటపడ్డాయి. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-01-10 05:46 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. క్రమంగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో దేశంలో ఏకంగా 1,79,723 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కూడా ఆందోళనకరంగా తయారైంది. ఏపీలో నిన్న 1200కి పైగా కొత్తకేసులు బయటపడ్డాయి. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై మాస్క్ లేకుండా బస్సు ఎక్కే ప్రయాణికులకు రూ.50 జరిమానా విధించనున్నారు. టికెట్ తో పాటు.. ఈ జరిమానాను కూడా టికెట్ రూపంలోనే ఇవ్వనున్నారట. కండక్టర్ల వద్ద ఉండే టికెట్ మిషన్లలో కూడా ఈ జరిమానాను అప్ డేట్ చేశారు. ఫైన్ బటన్ ను నొక్కగానే రూ.50 జరిమానా టికెట్ వస్తుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.


Tags:    

Similar News