దసరాకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
దసరా పండగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది
దసరా పండగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ దసరా పండగకు ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది. ఈ ఏడాది దసరా పండగకు వివిధ ప్రదేశాల నుంచి 1,061 అదనపు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ సర్వీసుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయబోవడం లేదని తెలిపింది.
అదనపు ఛార్జీలు లేవు...
ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకూ స్పెషల్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. సాధారణ ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఏపీకి దసరా సందర్భంగా నడుపుతున్న ప్రతి స్పెషల్ సర్వీసుకు రిజర్వేషన్లు కూడా అనుమతి ఇచ్చింది. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి నుంచి ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది.