ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతకు షాక్
ఇన్ స్పెక్టర్ స్వర్ణలత హీరోయిన్ గా ఏపీ 31 నంబర్ మిస్సింగ్ అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మించాలని
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, కానిస్టేబుల్ హేమసుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరితోపాటు హోంగార్డు వి.శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. వారిని విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకు తరలించారు. స్వర్ణలత బెయిల్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. గతంలో కూడా స్వర్ణలతపై చాలా ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు. ఏఆర్ హోంగార్డు ఎస్సైగా పనిచేస్తున్నప్పుడే హోంగార్డు నియామకాల విషయంలో ఆరోపణలొచ్చాయి. తర్వాత విజయవాడ బదిలీపై వెళ్లగా.. కొంత కాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. అక్కడ పనిచేస్తుండగా జిల్లాల విభజన జరగడంతో బదిలీపై అనకాపల్లి జిల్లాకు వెళ్లారు. విశాఖలో ఖాళీ ఉండటంతో ఇక్కడికి వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేసి తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ)గా బాధ్యతలు చేపట్టారు.