Posani Krishan Murali: పోసాని కృష్ణమురళి బెయిల్ పై ఎల్లుండి తీర్పు
సినీనటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై సీఐడీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి;

సినీనటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై సీఐడీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును న్యాయస్థానం ఈ నెల21వతేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై ఏపీ సీఐడీకి అందిన ఫిర్యాదుక మేరకు కేసునమోదు చేసిన సంగతి తెలిసిందే.
గుంటూరు జిల్లా జైలులో...
ప్రస్తుతం ఈ కేసులో పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో వాటన్నింటిలో పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. సీఐడీ కేసులో మాత్రం ఈ నెల 21న తీర్పు రానుంది. పోసాని కృష్ణమురళిని ఒకరోజు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సీఐడీ పోలీసులు ఆయనను అనేక రకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.