ఇకపై వారానికొకసారి పిఠాపురంపై సమీక్ష
పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై ప్రతి వారం ఇక సమీక్షలు జరుపుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు;

పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై ప్రతి వారం ఇక సమీక్షలు జరుపుతానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో ప్రతి సమస్యకు పరిష్కారం చేయడానికి తాను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానని తెలిపారు. మరోవైపు వచ్చే వేసవిలో పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
తాను రాకపోయినా...
తాను నిత్యం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించకపోయినా అక్కడ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ఉన్నామని తెలిపారు. వరసగా ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామన్నపవన్ కల్యాణ్ పిఠాపురాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనింప చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పిఠాపురంలోని నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితులపై తనకు ఇంటలిజెన్స్ నివేదికను ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతలను నిరంతరం తాను సమీక్షిస్తుంటానని తెలిపారు.