Breaking : మండే.. జడ్జిమెంట్

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారం వెల్లడిస్తానని తెలిపారు.

Update: 2023-10-06 08:31 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు గత ఇరవై ఎనిమిది రోజుల నుంచి రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఆయన తరుపున న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.

కస్టడీ పిటీషన్ పై..
మరోవైపు చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపున న్యాయవాదులు కోరారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని సీఐడీ తరుపున న్యాయవాదులు కస్టడీ పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పు సోమవారం వెల్లడిస్తానని న్యాయమూర్తి చెప్పారు. సోమవారం చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులోనూ విచారణ జరగనుంది.


Tags:    

Similar News