విజయవాడలో హైందవ శంఖారావానికి ఏర్పాట్లు

గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ నెల 5వ తేదీన విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖారావానికి ఏర్పాట్లు చేస్తున్నారు;

Update: 2025-01-02 04:10 GMT

గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ నెల 5వ తేదీన విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగే హైందవ శంఖారావానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల్లో హైందవులు హాజరవుతారని ఈ మేరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏర్పాట్లను ఏలూరు పోలీస్‌ రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ సీపీ రాజశేఖర్‌బాబు, కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.

వసతులపై సమీక్ష...
కార్యక్రమ నిర్వహణ, ప్రజల రవాణా, వసతి, మౌలిక సదుపాయాలు ఇతర విషయాలపై విశ్వహిందూ పరిషత్‌ పెద్దలతో కలిసి విమానాశ్రయ ఆవరణలో సమీక్షించారు. అనంతరం సభావేదికతో పాటు ఉప్పులూరు రైల్వేస్టేషన్‌ పరిసరాలు, పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాలు, గ్యాలరీలను సందర్శించిన పోలీసు ఉన్నతాధికారుల బృందం నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేశారు. బందోబస్తుకు అవసరమైన పోలీసు సిబ్బంది వివరాలపై చర్చించారు. సభ పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, హైవేపై ట్రాఫిక్, విమానాశ్రయ ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామస్థుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.


Tags:    

Similar News