వైకుంఠ ద్వారాలు.. రేపు అర్థరాత్రి నుంచే?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలా టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 13వ తేదీన వైకుంఠ ఏకాదశి. బుధవారం అర్ధరాత్రి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరచుకోనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశముంది. వీఐపీ సిఫార్సులను కూడా టీటీడీ రద్దు చేసింది.
అన్ని ఏర్పాట్లు పూర్తి....
ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. చరిత్రలో ఇన్ని రోజులు కొనసాగడం ఇదే ప్రధమమని చెబుతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. దీంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, ఆహారం,వసతి వంటి సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతుంది.