జీవో నెంబరు వన్ పై స్టే కొనసాగింపు లేనట్లే

నేటితో జీవో నెంబర్ వన్ పై స్టే గడువు ముగిసింది. అయితే దానిని కొనసాగిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించలేదు.;

Update: 2023-01-23 12:28 GMT

నేటితో జీవో నెంబర్ వన్ పై స్టే గడువు ముగిసింది. అయితే దానిని కొనసాగిస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించలేదు. జీవో నెంబరు వన్ ను సవాల్ చేస్తూ దాఖలయిన కొత్త పిటీషన్లపై రేపు వాదనలను విననున్నట్లు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ప్రకటించింది. జీవోపై వెకేషన్ బెంచ్ ఇచ్చిన స్టేను కొనసాగింపుగా ధర్మాసనం లెలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో ఈరోజుతో జీవో నెంబర్ వన్ పై కోర్టు విధించిన స్టే ముగిసింది.

రేపు వాదనలను విన్న తర్వాత...
రేపు అన్ని పిటీషన్లపై వాదనలను విన్న తర్వాత ధర్మాసనం తన తీర్పును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో కొంత అలజడిని రేపాయి. "గత పదిరోజుల్లో పిటీషనర్ ధర్మా చేశారా? లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాల్సిన తొందరేముంది? జీవో నెంబరు 1 విషయంలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసు. వెకేషన్ బెంచ్ సీజే బదులగా పనిచేస్తుందా? ఇలాంటి పిటీషన్లను వెకేషన్ బెంచ్ ఎలా స్వీకరిస్తుంది? దీన్ని అనుమతిస్తే వెకేషన్ బెంచ్ సీజేగా మారిపోతుంది. వెకేషన్ బెంచ్ ప్రతి అంశాన్ని ముఖ్యమైనదని విచారణకు స్వీకరిసతే హైకోర్టు ప్రాధాన్యత ఏమవ్వాలి? తనకు ప్రతి అంశం హైకోర్టు రిజిస్ట్రీ అప్ డేట్ చేసింది. పిటీషనర్ కు లబ్ది చేయడానికి కాకపోతే ఏమిటీ తొందర?" అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు.


Tags:    

Similar News