Breaking : నాలుగో రోజూ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

శాసనసభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఒకరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు

Update: 2023-03-18 04:59 GMT

శాసనసభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించాలంటూ డిమాండ్ చేశారు. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు ప్రారంభించిన వెంటనే టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. జగన్ ఢిల్లీ పర్యటనపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సాధించుకు వచ్చిందేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

పోడియంఎదుట...
అయితే స్పీకర్ ఎంత చెప్పిన వారు ఆందోళన విరమించలేదు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం ఢిల్లీలో రాష్ట్రాభివృద్ధిపైనే చర్చించారన్నారు. పోలవరం నిధులను సత్వరమే విడుదల చేయాలని కోరిందని తెలిపారు. అయితే టీడీపీ సభ్యులు తమ ఆందోళన మాత్రం ఆగలేదు. అయినా ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ మాత్రం సభ సజావుగా సాగేలా సహకరించాలని పలుమార్లు కోరుతూనే ఉన్నారు. కానీ సభ్యులు వినకపోవడంతో ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు.


Tags:    

Similar News