Tiruamala : నేరుగా శ్రీవారి దర్శనం

దసరా సెలవులు ముగియడంతో తిరుమలలో శ్రీవారి దర్శనం భక్తులకు నేరుగా దొరుకుతుంది

Update: 2023-11-01 02:17 GMT

దసరా సెలవులు ముగియడంతో తిరుమలలో శ్రీవారి దర్శనం భక్తులకు నేరుగా దొరుకుతుంది. క్యూ లైన్లలో వేచి ఉండకుండానే భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కూడా సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండకుండా భక్తులు నేరుగా క్యూ లైన్ లో స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మళ్లీ వీకెండ్ వరకూ దాదాపు ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది.

రికార్డు స్థాయిలో ఆదాయం...
అయితే ఆదాయం మాత్రం రికార్డు స్థాయిలో నిన్న వచ్చింది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.19 కోట్ల రూపాయలు వచ్చింది. నిన్న తిరుమల శ్రీవారిని 62,269 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,255 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. దాదాపు నెల రోజుల తర్వాత ఇంత భారీగా ఆదాయం రావడం ఇదే తొలి సారి కావడం విశేషం.


Tags:    

Similar News